Former India cricketer VVS Laxman turned 43-years-old on Wednesday (November 1) and cricketing fraternity took to Twitter congratulate the Hyderabadi batsman. Laxman, who is known for his stylish batting, has played 134 Tests for India and scored 8781 runs. He is still hailed as one of the best batsmen when it comes to using his wrist.
బుధవారం (నవంబర్ 1) టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ 43వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన లక్ష్మణ్ భారత జట్టుకు అనేక అద్భుతమైన విజయాలనందించాడు. మణికట్టుతోనే చూడచక్కని షాట్లు ఆడే లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా ఉన్నారు. 134 టెస్టులాడిన లక్ష్మణ్ 8781 పరుగులు సాధించగా ఒక్క ఆస్ట్రేలియాపైనే 3,173 పరుగులు చేయడం విశేషం. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లక్ష్మణ్ చేసిన 281 పరుగుల ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటి ఐసీసీ వెల్లడించిన సంగతి తెలిసిందే.అప్పటివరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆసీస్‌కు లక్ష్మణ్ ఇన్నింగ్స్ అడ్డుకట్ట వేసింది. ఫాలో ఆన్ ఆడుతున్న భారత్‌కు తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్ని తెచ్చిపెట్టాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఆస్ట్రేలియన్లకు వీవీఎస్ లక్ష్మణ్ అంటే భయం పట్టుకుంది.